ETV Bharat / state

విదేశాల నుంచి స్వదేశానికి రాకపోకలు... అధికారులు అప్రమత్తం

విదేశాల నుంచి స్వదేశానికి... భారతీయులను తీసుకొచ్చే విమానాల రాకపోకలు ప్రారంభం కావడం వల్ల కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. కొవిడ్‌-19 నేపథ్యంలో యువ అధికారులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విధులకు ఉపయోగిస్తూ.. నిఘా పెంచారు. బంగారం, ఇతర విలువైన వస్తువుల అక్రమ దిగుమతిని నిలువరించేందుకు కస్టమ్స్‌ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లుతున్నారు.

customs officers alert in shamshabad airport
విదేశాల నుంచి స్వదేశానికి రాకపోకలు... అధికారులు అప్రమత్తం
author img

By

Published : May 10, 2020, 7:18 PM IST

ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు 'వందే భారత్‌ మిషన్‌'ను కేంద్రం చేపట్టడం వల్ల కస్టమ్స్‌ అధికారులు పూర్తిగా సన్నద్ధమయ్యారు. దాదాపు యాభై రోజులుగా విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, కేవలం కార్గో విమానాలు మాత్రమే తిరుగుతుండడం వల్ల కస్టమ్స్‌ అధికారుల నిఘా అంతగా అవసరం ఉండేది కాదు. ఎగుమతులు, దిగుమతులకు కొవిడ్‌-19 సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్‌ ఇచ్చేందుకు కస్టమ్స్‌ అధికారులు ఇన్ని రోజులు నిమగ్నమై ఉన్నారు. 'వందే భారత్‌ మిషన్'‌ అమలులో భాగంగా తొలిసారి కువైట్‌లో చిక్కుకున్న 163 మందితో ప్రత్యేక విమానం శనివారం రాత్రి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. ఇది మొదలు కావడం, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుని స్వదేశానికి వచ్చేందుకు వేచి ఉన్న వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారుల నిఘా పెరిగింది.

50 ఏళ్ల లోపు వారికే విధులు..

సాధారణంగా విమానాల రాకపోకలు కొనసాగేటప్పుడు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి షిష్ట్‌లో 30 నుంచి 35 మంది ఉంటారు. కానీ ఇప్పుడు వందే భారత్‌ మిషన్‌ పరిధిలో తరచూ ఒకటి రెండు విమానాలే వస్తుండడం వల్ల కస్టమ్స్‌ శాఖ పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ముంబయిలో ఓ కస్టమ్స్‌ అధికారి ఒకరు.. కొవిడ్‌-19 బారిన పడి మృత్యువాత పడడం వల్ల శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పర్సనల్ ప్రొటెక్షన్​ ఎక్విప్‌మెంట్లు తప్పనిసరిగా ధరిస్తున్నారు. యాభై ఏళ్ల లోపు వారికే ఎయిర్​పోర్టు విధులు అప్పగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రెండు షిప్టులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక జాయింట్‌ కమిషనర్‌, ఒక డిప్యూటీ కమిషనర్‌, ముగ్గురు సూపరింటెండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు విధుల్లో ఉంటూ... స్థానిక శాంతిభద్రతల పోలీసుల సహకారం తీసుకుంటున్నారు.

లగేజి క్షుణ్ణంగా పరిశీలిస్తారు..

విదేశాల నుంచి వచ్చిన వారి లగేజిలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా బంగారం, విలువైన మొబైల్‌ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, టీవీలు లాంటి వాటితోపాటు లిక్కర్‌ లాంటివి అక్రమంగా తీసుకొస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం చేస్తున్నారు. అదేవిధంగా విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికుల జాబితా తీసుకుని ఎయిర్​పోర్టు ప్యాసెంజర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ద్వారా పరిశీలిస్తారు. ప్రయాణికుడి పేరు, పాస్‌పోర్ట్‌ నంబరు కొట్టగానే సంబంధిత వ్యక్తికి చెందిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికుల్లో ఎవరైనా తరచూ గల్ఫ్‌ దేశాలకుగాని, విదేశాలకుకాని వెళ్లి వస్తున్నట్లు వివరాలు ఉన్నట్లయితే... వారు గతంలో ఎప్పుడెప్పుడు ఏయే దేశాల్లో తిరిగారు. గతంలో బంగారంకానీ, విదేశీ కరెన్సీకానీ అక్రమంగా తీసుకొస్తూ ఏ ఎయిర్‌ పోర్టులో అయినా దొరికారా తదితర వివరాలు పరిశీలిస్తారు. ఒకవేళ గతంలో విరివిగా ప్రయాణాలు చేసినట్లు గుర్తిస్తే తక్షణమే వారిని నిశితంగా పరిశీలిస్తారు. బంగారంకానీ ఇతరత్ర ఏదైనా స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తిస్తే... తక్షణమే సంబంధిత ప్రయాణికుడికి కొవిడ్‌-19 పరీక్షలు చేయిస్తారు. అతనికి పాజిటివ్‌ వచ్చినట్లయితే.. వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తారు. లేదంటే సాధారణంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారు.

యాభై వేలకు మించి ఉంటే కస్టమ్స్​ డ్యూటీ..

కొవిడ్‌-19 దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు, ప్రయాణికుడిని తాకకుండానే.. నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికులు... యాభైవేలు విలువైన సామాగ్రి వరకు ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ లేకుండా వెంట తెచ్చుకోవచ్చని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. అంతకుమించితే చట్టప్రకారం తప్పనిసరిగా కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలి. లేదంటే ఆ వస్తువులను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటారు.

ఇవీ చూడండి: ఐదుగురు ఎయిర్​ ఇండియా పైలట్లకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.