ఐదుగురు ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా సోకింది. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముంబయికి చెందిన వీరంతా ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన కార్గో ఫ్లైట్లలో విధులు నిర్వర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పరీక్షలకు ముందు ఈ ఐదుగురిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.
పైలట్లు తమ విధులకు హాజరయ్యే 72 గంటల ముందుగా చేసిన పరీక్షల్లో వీరికి పాజిటివ్‌గా తేలింది. వీరు గత 3 వారాల నుంచి ఎలాంటి విధులు నిర్వర్తించలేదని మరో అధికారి వెల్లడించారు. ఏప్రిల్ 20కి ముందు మాత్రమే చైనాకు కార్గో విమానాలను నడిపారని తెలిపారు.
వందేభారత్మిషన్లో భాగంగా.. లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఈ తరుణంలో పైలట్లకు కరోనా సోకడం కలవరం రేపుతోంది.