హైదరాబాద్ రవీంద్రభారతిలో పదమూడో అవే జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మండలి బుద్ధ ప్రసాద్, పరకాల ప్రభాకర్ హాజరయ్యారు. దేశంలో 65 శాతం ప్రజలు ఏదో ఒక పని కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదని వారు ఆరోపించారు. ఎక్కడ అవినీతి జరిగితే అవినీతికి పాల్పడిన వ్యక్తిని సిగ్గుపడేలా చేయాలని నేతలు పిలుపినిచ్చారు. ఆదర్శమూర్తులను నిత్యం సమాజంలో గౌరవించబడేలా చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నిజాయతీగా పని చేసిన 11 మందికి అవార్డులు ప్రదానం చేశారు.
ఇదీ చూడండి: విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధంకండి: లక్ష్మణ్