ETV Bharat / state

పంద్రాగస్టు కోసం గోల్కొండలో ముమ్మరంగా ఏర్పాట్లు - visit

స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం హైదరాబాద్ గోల్కొండలో జరుగుతున్న  ఏర్పాట్లును సీఎస్​ జోషి, డీజీపీ మహేందర్​ రెడ్డి , జీహెచ్​ఎంసీ కమిషనర్​తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎస్​ పలు సూచనలు చేశారు.

Golconda Fort
author img

By

Published : Aug 13, 2019, 11:31 AM IST

హైదరాబాద్ గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం అధికారులు పనులను వేగవంతం చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్​ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. సీఎస్ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొని... పలు సూచనలు చేశారు. కోటను జాగిలాలు, బాంబు స్వాడ్​తో తనిఖీ చేస్తున్నట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి వెల్లడించారు. కోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులను భారీగా మోహరించినట్లు డీజీపీ తెలిపారు.

పంద్రాగస్టు కోసం గోల్కొండలో ముమ్మరంగా ఏర్పాట్లు

ఇవీ చూడండి;నాగార్జునసాగర్​కు స్థిరంగా కొనసాగుతోన్న ప్రవాహం..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.