ఈ నెల 12 నుంచి జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభ వేడుకలను విజయవంతం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు.
12న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని చెప్పారు. వరంగల్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొంటారని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్‌ను సీఎస్ ఆదేశించారు. 11, 12 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుదీకరించాలని తెలిపారు.
ఇదీ చదవండి: 'ధాన్యం సేకరణ కేంద్రాలు మూసేస్తామని తెలంగాణ చెప్పలేదు'