రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రజలు ఎవరూ ప్రయాణాలు చేయొద్దని... తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అనుమతించట్లేదని వెల్లడించారు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూసివేశామని... పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు వివరించారు.
గ్రామాల్లో పనులకు మాత్రమే అనుమతి
కేవలం గ్రామాల్లో వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం పనులు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావడానికి వీల్లేదని... నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సేవలు అవసరమైతేనే అనుమతిస్తామని... ప్రజలందరూ లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలని సీఎస్ కోరారు.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు