ETV Bharat / state

కేసీఆర్​కు 'హరితహారం'తో శుభాకాంక్షలు - cm kcr birthday celebrations

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్​ సంజీవయ్య పార్కులో సీఎస్​ సోమేశ్​కుమార్​, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్​శర్మతో పాటు పలువురు ఐఏఎస్​ అధికారులు మెుక్కలు నాటారు.

cs somesh kumar participated in cm kcr birthday celebrations in hyderabad
'కేసీఆర్​ ఆశయసాధనలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది'
author img

By

Published : Feb 17, 2020, 4:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్​శర్మ, పలువురు ఐఏఎస్ అధికారులు మొక్కలు నాటారు. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆశయసాధనలో పాలుపంచుకొంటున్నందుకు ఆనందంగా ఉందని... ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎస్ చెప్పారు.

హరితహారంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని, ప్రతి శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి తెలంగాణను ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. భాగ్యనగరంలో పచ్చదనాన్ని పెంచి వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. పెద్దఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

'కేసీఆర్​ ఆశయసాధనలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది'

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.