బేరియం సాల్ట్‌తో బాణాసంచాను(fireworks) తయారు చేసినా... విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(CS Somesh Kumar) తెలిపారు. విక్రయదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించారు. హోంశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. గత నెల 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గురించి చర్చించారు. బాణాసంచాలో బేరియం సాల్ట్ వినియోగంపై సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిషేధం గురించి అధికారులకు వివరించారు. బాణాసంచా తయారీదారులు, విక్రయదారులు తప్పక ఈ ఆదేశాలను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీపావళి రోజు ఈ జాగ్రత్తలు పాటించండి..
- గాలి వీస్తున్నప్పుడు పైకి ఎగిరేవి కాల్చవద్దు. కాల్చే ముందు చుట్టుపక్కల ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉండేలా చూసుకోవాలి.
- కాల్చిన బాణాసంచాను బకెట్‌లో వేయాలి.
- బకెట్ నిండా నీటిని దుప్పట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- కళ్లకు హానీ జరగకుండా అద్దాలు వాడాలి.
- చిన్నపిల్లలకు ఇవ్వకుండా పెద్దవారు దగ్గర ఉండి కాల్చేలా చూడాలి.
- నూలు, ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించాలి.
- చేతులు దూరంగా చాచి క్రాకర్లు వెలిగించాలి.
- అంతే కాకుండా బాణసంచా కాల్చిన వెంటనే... వాటి దగ్గరకు పోవద్దని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఆ టపాసుల్ని అన్ని రాష్ట్రాల్లో నిషేధించాల్సిందే'