ETV Bharat / state

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్​, సీపీ - గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్​ సీపీ

హైదరాబాద్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సీఎస్‌ సోమేశ్​ కుమార్​, హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ సందర్శించారు. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ లభ్యత సహా పలు వివరాలపై ఆరా తీశారు.

CS somesh kumar CP anjani kumar, hyderabad Gandhi Hospital
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్​, సీపీ
author img

By

Published : May 7, 2021, 2:19 PM IST

Updated : May 7, 2021, 3:11 PM IST

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీపీ అంజనీకుమార్​ సందర్శించారు. గాంధీలో బెడ్లు, ఆక్సిజన్ లభ్యతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలకు సంబంధించి సీఎస్​ క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తున్నారు.

పలు వార్డుల్లో తిరిగి కొవిడ్​ బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగం వద్ద ఏర్పాటు చేసిన నూతన పడకలను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మందులు, ఆక్సిజను కొరత రాకుండా చూడాలని వైద్యులు సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన హెల్ప్​డెస్క్​ను పరిశీలించారు. కొవిడ్​ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించాలని పోలీస్​ కమిషనర్​ను సీఎస్​ కోరారు.

నిన్న జీహెచ్​ఎంసీ పరిధిలో ఆకస్మికంగా తనిఖీ చేసి ర్యాపిడ్ ఫీవర్ సర్వే వివరాలు సీఎస్​ అడిగి తెలుసుకున్నారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించి కొవిడ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులను వివరించారు. సీఎం ఆదేశాల మేరకు కరోనా కట్టడి చర్యలు, చికిత్సకు సంబంధించిన అంశాలపై సోమేశ్​ నేరుగా దృష్టిసారించారు.

ఇదీ చూడండి: పడకలు కావాలన్నా, మృతదేహాలు తరలించాలన్నా రూ.వేలల్లో వసూలు

Last Updated : May 7, 2021, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.