ETV Bharat / state

cs review:'కొవిడ్​ నిబంధనలు పాటిస్తున్నట్లు బ్యానర్లు పెట్టండి' - జిల్లా కలెక్టర్లతో సీఎస్​ సోమేశ్​కుమార్​ సమీక్ష

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను సీఎస్​ సోమేశ్​కుమార్​ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య, పంచాయతీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు.

cs review
cs review
author img

By

Published : Sep 3, 2021, 5:06 PM IST

రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్​.. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య-ఆరోగ్య, పంచాయతీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ వివరాలను ఆరా తీశారు. ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది, స్కూల్ బస్ డ్రైవర్లు, మధ్యాహ్న భోజన పథక సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ టీకాలు వేయించాలని అధికారులకు స్పష్టం చేశారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్లు, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు పాఠశాలల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.

మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్త

పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ పాఠశాలలను శుభ్రం చేయాలని తెలిపారు. ఎవరైనా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించాలని... పాజిటివ్ వస్తే తగిన ఐసోలేషన్ చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల సిబ్బంది, సంబంధం ఉన్న వారికి టీకాలు వేయించేందుకు ఆర్బీఎస్కే వాహనాలను వినియోగించుకోవాలని సీఎస్ తెలిపారు.

అంతంత మాత్రంగానే హాజరు

కొవిడ్ ప్రభావంతో ఆన్​లైన్ బోధనకే పరిమితమైన రాష్ట్ర విద్యాసంస్థలు ఈనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకున్నాయి. భిన్నమైన వాదనలు, అభిప్రాయాల మధ్య ప్రత్యక్ష బోధనకు సర్కారు అనుమతించింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. ఆన్​లైన్ పాఠాలు ఇక ఉండబోవన్న సర్కారు.. హైకోర్టు ఉత్తర్వులతో కొన్ని మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ఇంకా తెరుచుకోలేదు.

అవగాహనపై దృష్టి

పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్న పిల్లల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యాలయాలను తనిఖీ చేస్తూ... కొవిడ్​ నిబంధనలు అమలు, మధ్యాహ్న భోజనం, వసతుల కల్పన తదితరాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు మాస్కులు ధరించడం, శానిటైజేషన్​, భౌతిక దూరం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.

కళాశాలల్లో ప్రత్యక్షబోధన..

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లోను ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. ఆన్​లైన్​ తరగతులు ఉండవని... అవసరమైతే యూట్యూబ్ పాఠాలనూ వినవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధన నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: Corona Cases in Schools: పాఠశాలలపై కరోనా పంజా.. రెండు చోట్ల ఐదుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.