ETV Bharat / state

Crop Loss in Telangana: అకాల వర్షం.. అన్నదాతకు మిగిల్చింది తీరని శోకం - తెలంగాణలో పంట కొనుగోలు లేదు

Crop Loss in Telangana: గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాలను మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులకు ఉద్యాన పంటలు నేలరాలగా.. వర్షానికి ధాన్యపు రాశులు నీటి పాలయ్యాయి. నీళ్ల నుంచి తీసి ఎండబెట్టేలోపే మరోసారి వర్షం పడుతుంటడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఏ రైతును కదిలించినా కన్నీటి వ్యథ. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలైందని ఆవేదన. వాన నష్టాలు దాటుకొని.. కేంద్రాలకు పంటను తీసుకువచ్చినా సకాలంలో కొనుగోళ్లు జరగక వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నాడు రైతన్న.

crop loss in telangana
అకాల వర్షం.. రైతుకు మిగిల్చింది శోకం
author img

By

Published : May 4, 2023, 8:53 PM IST

Crop Loss in Telangana: అకాల వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. ఏ జిల్లాలో చూసినా చేతికొచ్చిన పంట నీటిపాలై రైతన్న కుదేలయ్యాడు. వడగళ్లు, అకాల వర్షాలతో రాష్ట్రంలో యాసంగి పంటలకు కనీవినీ ఎరగని నష్టం వాటిల్లింది. ప్రస్తుత సమయంలో యాసంగి వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, జొన్న, పత్తి, వేరుశనగ, శనగ, పెసలు, నువ్వులు, మినుములు, బొబ్బర్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. నిమ్మ, నారింజ, బొప్పాయి వంటి పండ్ల తోటల నుంచి కాయలు తీస్తారు. వర్షాలు పడి ఆగిపోతే.. ఆ తర్వాత పంటలు కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ, వరుస వానలతో వాటిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్‌: నల్గొండ జిల్లా అనుముల, నిడమనూరు మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌తో మాచర్ల-నల్గొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఐకేపీ కేంద్రాలకు తీసుకువస్తే నెల కావస్తున్నా తూకం వేయటం లేదని వాపోయారు. వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకెత్తిందంటూ రోడ్డుపై పంటను పోసి పురుగు మందు డబ్బాలు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. మునగాల మండలం రేపాలలో ఐకేపీ కేంద్రంలోని ధాన్యం రాశుల్లోకి వరద నీరు చేరింది. తేమ పేరుతో ఆలస్యం చేస్తూ తమను నట్టేట ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్‌ మార్కెట్‌ యార్డులో: నిర్మల్‌ మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అకాల వర్షాలతో తడిసిన పంటలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని ఇంద్రకరణ్‌ వెల్లడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని... ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకోవాలని సూచించారు.

నిజామాబాద్​లో ఇలా: నిజామాబాద్ జిల్లా భీంగల్ సొసైటీ ఎదుట సికింద్రాపూర్ రైతులు ధాన్యం కొనాలంటూ ఆందోళన చేపట్టారు. హమాలీల కూలీ, మధ్యవర్తులు ఐదు కేజీల ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నినాదాలు చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి చేలను పశువులకు వదిలేస్తున్నారు. వడగళ్ల ధాటికి ధాన్యమంతా పొలాల్లో రాలిపోవడంతో చేసేదేమీ లేక గేదెలను మేపుతున్నారు. కనీసం కోతయంత్రాలకు ఇచ్చే డబ్బులు సైతం రావని అందుకే పంటను వదిలేస్తున్నామని రైతులు తెలిపారు. కామారెడ్డిలో పంట నష్టపోయిన కర్షకులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. గాంధీగంజ్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు.

బోధన్ నియోజకవర్గంలో పరిస్థితి: వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని కోరారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడిన ఆయన.. మద్దతు ధరకు వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అకాల వర్షం.. రైతుకు మిగిల్చింది శోకం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.