ETV Bharat / state

Crop Loan:  అందని పంట రుణాలు... వడ్డీలతో ఆర్థికంగా నష్టాలు - Telangana news

అందరికీ అన్నం పెట్టే రైతులకు బ్యాంకుల నుంచి సకాలంలో పంట రుణాలు అందడంలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపుగా 5.13 లక్షల మంది రైతులుంటే 14.04 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. గత ఏడాది రూ. 18,382 పంటరుణ ప్రణాళికను ఖరారు చేస్తే ఇచ్చింది కేవలం రూ.4,591 కోట్లే. ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యాపారుల ముందు చేయిచాచక తప్పని దుస్థితి ఏర్పడుతోంది.

Crop
రుణాలు
author img

By

Published : Jul 24, 2021, 1:55 PM IST

రాష్ట్రంలో పత్తి పంటకు ప్రధాన కేంద్రంగా నిలుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు సరిగా పంపిణీ కావడంలేదు. అసలు పంట రుణ ప్రణాళికలే సకాలంలో ఖరారు కావడంలేదు. నిబంధనల ప్రకారమైతే జూన్‌ రెండో వారంలోప్రారంభమయ్యే ఖరీఫ్‌ను దృష్టిలో ఉంచుకొని... ఏప్రిల్‌-మే మాసంలోనే రుణ ప్రణాళికలను ఖరారు చేయాలనే కనీస నిబంధనలను అధికార యంత్రాంగం పాటించడంలేదు.

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్ నిబంధనల ప్రకారమైతే పత్తి ఎకరాకు రూ. 38వేలు, నీటి వసతి కలిగిన పత్తికి రూ. 46వేలు రుణం ఇవ్వాలనే నిబంధనలు అమలు కావడంలేదు. బ్యాంకుల లావాదేవీల ప్రాధాన్యత క్రమాన్ని పరిగణలోకి తీసుకుంటే పంటరుణాలు ముందుగా ఇవ్వాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పారిశ్రామిక, గృహ, వాహన రుణాలకు ఇచ్చే ప్రాధాన్యత పంట రుణాలకు ఇవ్వడంలేదు.

కొత్త రుణాలేవి...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం నిర్దేశిత పంట రుణ లక్ష్యాన్ని చేరుకోకపోగా... ఈ ఏడాది రూ. 7,046 కోట్ల పంట రుణాలను లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇందులో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణాలిచ్చారనేది సందేహాస్పదంగానే మారింది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష రుణ మాఫీ ప్రకటించడంతో చాలా మంది రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదు.

దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది బ్యాంకర్లు పాత వాటికి... పుస్తక సర్దుబాటు చేసుకోవడం తప్ప కొత్త రుణాలు ఇవ్వడంలేదు. ఫలితంగా రైతులు రూ. వందకు రూ. 25 చొప్పున వడ్డీకి తీసుకొని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. బ్యాంకర్ల పనితీరును ప్రజాప్రతినిధులు, అధికారుల పరిగణలోకి తీసుకోకపోవడంతోనే పంట రుణాల లక్ష్యం నీరుగారుతుందనే ఆరోపణలు రైతుల సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.

రైతుల పాలిట శాపం...

క్రిమిసంహారక మందులు, ఎరువులు సైతం రూ. వందకు 25శాతం వడ్డీ చొప్పున అప్పు కిందనే ఇచ్చే అనధికార విధానం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకోవడం... చేతికొచ్చిన పంటను వ్యాపారికి అప్పజెప్పడం అనే ప్రక్రియ రైతుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. కానీ గత్యంతరంలేని పరిస్థితుల్లో వ్యాపారులను ఆశ్రయించక తప్పని దుస్థితి ఏర్పడుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పంట రుణాల పరిస్థితి..

జిల్లా లక్ష్యం గత ఏడాది రుణప్రణాళిక ప్రగతి (రూ. కోట్లలో ) ఈ ఏడాది లక్ష్యం ( రూ. కోట్లలో)
ఆదిలాబాద్‌ 1,790.67 1406.10 1,988.63
నిర్మల్‌ 1,646.45 1406.10 1,957.35
కుమురంభీం 1,646.45 680.31 1,357.87
మంచిర్యాల 1,539 1,070 1,713

ఇదీ చూడండి: ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.