ETV Bharat / state

నేరాల నియంత్రణకు రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో ఒప్పందం! - హైదరాబాద్​ వార్తలు

ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా రాష్ట్రంలో నేరాలను తగ్గించవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై గురువారం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ కార్యాలయంలో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.

Crime Control in telangana state police department mou with Remote Sensing Center
నేరాల నియంత్రణకు రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో ఓప్పందం!
author img

By

Published : Jan 17, 2020, 7:57 AM IST

Updated : Jan 17, 2020, 8:09 AM IST

రాష్ట్రంలో నేర నియంత్రణ, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, అన్ని పోలీస్​స్టేషన్‌ల సరిహద్దుల నిర్ధరణకు స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. ఈ అంశాలపై డీజీపీ మహేందర్‌ రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌సెన్సింగ్‌ అప్లికేషన్‌సెంటర్‌ కార్యాలయంలో ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ట్రాక్‌ సైంటిఫిక్‌ ఇంజినీర్లతో సమావేశం జరిపారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్ధ ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ అన్నారు. అందుకు తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోనున్నట్టు తెలిపారు.

తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి
పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది,ఐటీ,రిమోట్‌ ఆధారిత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పౌర సమాజాన్ని రూపొందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవించే ప్రాంతాలు, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ను ట్రాక్‌ సహాయంతో చేపట్టనున్నట్టు డీజీపీ వివరించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అదనపు డీజీ జితేందర్‌, అదనపు డీజీ అభిలాష్​ బిస్త్‌, తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో ఒప్పందం!

ఇదీ చూడండి : 'అభివృద్ధి చేసే నేతలకే ఓటేద్దాం...'

TG_HYD_45_16_DGP_ON_TRACK_TECHNOLOGY_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:డెస్క్‌ వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. ( ) రాష్ట్రంలో నేర నియంత్రణ మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంతో పాటు అన్ని పోలీస్‌స్టేషన్ల సరిహద్దుల నిర్దారణ, పోలీస్‌ శాఖ భూముల పరిరక్షణకు స్పేస్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డి రిమోట్‌సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ కార్యాలయంలో ట్రాక్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇంజినీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు సాంకేతిక పరిజ్ఞనం వినియోగం ద్వారా సాధ్యమవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రిమోట్‌సెన్సింగ్‌ అప్లికేషన్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞనం పొందేందుకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఆయన చెప్పారు. పోలీసు అధికారులు సిబ్బంది ఐటీ రిమోట్ ఆధారిత పరిజ్ఞనాన్ని వినియోగించుకోవడం ద్వారా మెరుగైన సమాజాన్ని రూపొందించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పారు. రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్‌, తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ను ట్రాక్‌ సహాయంతో చేపట్టనున్నట్టు వివరించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్‌ చేయాలని నిర్ణయించినట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అదనపు డీజీ జితేందర్‌, అదనపు డీజీ అభిలాష బిస్త్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Last Updated : Jan 17, 2020, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.