రాష్ట్ర క్రెడాయ్ ఛైర్మన్ గుమ్మిరామిరెడ్డి క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన స్థిరాస్థి రంగ వ్యాపారంలో స్థిరపడి అంచలంచలుగా ఎదుగుతున్నారు. ఆయన 1989 నుంచి మూడు దశాబ్దాలుగా స్థిరాస్థి రంగంలో కొనసాగుతున్నారు. ఏఆర్‌కే గ్రూప్ ఛైర్మన్‌గా రామిరెడ్డి అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిర్మాణాలను చేశారు. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్‌గా ఉంటున్న ఆయన.. తాజాగా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
డెవలపర్స్ గౌరవాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని గుమ్మిరామిరెడ్డి అన్నారు. ప్రధానంగా చిన్న, మధ్య తరహా నిర్మాణ దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కొత్తగా ఎన్నికైన క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్దన్ పటోడియాతో సమన్వయం చేసుకుని... దక్షిణ భారతానికి చెందిన డెవలపర్స్ సహకారంతో ముందుకెళ్లనున్నట్లు గుమ్మి రామిరెడ్డి వివరించారు.
ఇదీ చూడండి: ఉన్నతాధికారుల పీఏనంటూ మోసాలు: సీపీ అంజనీకుమార్