ETV Bharat / state

నిర్మాణ రంగానికి అనుమతివ్వాలని కేటీఆర్​కు క్రెడాయ్​ విజ్ఞప్తి - Credai appeals to KTR to allow construction sector works in lock down time

లాక్​డౌన్​ సమయంలో నిర్మాణ రంగానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి క్రెడాయ్​ విజ్ఞప్తి చేసింది. కొవిడ్​ నిబంధనలతో నిర్మాణ ప్రాంగణంలో పనులు చేసుకుంటామని క్రెడాయ్​ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి.. మంత్రి కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

Credai appeals to KTR to allow construction sector works in lock down time
నిర్మాణ రంగానికి అనుమతివ్వాలని కేటీఆర్​కు క్రెడాయ్​ విజ్ఞప్తి
author img

By

Published : May 12, 2021, 11:10 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాణాలకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్​కు క్రెడాయ్‌ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ రోజు నుంచి పదిరోజులపాటు లాక్​డౌన్ అమలులో ఉండటం వల్ల తాము ఈ ప్రతిపాదన చేసినట్లు రాజశేఖర్​ రెడ్డి తెలిపారు. నిర్మాణ ప్రాంగణాల్లో పనులు చేసుకోడానికి అనుమతివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.

తమిళనాడులో మాదిరి ఇక్కడా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పనులు చేసుకుంటామని మంత్రికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.