ETV Bharat / state

కార్డియాక్​ అరెస్ట్​.. CPR చేయడం ఎలా? గాంధీ ఆసుపత్రిలో 10 వేల మందికి ట్రైనింగ్ - Telangana latest news

CPR Training at Gandhi Hospital: గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు బాధితులు ఎక్కువ అవుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె పనిచేయటం ఆగిన వారిని కాపాడుకునేందుకు గాంధీ ఆస్పత్రిలో జనహితా సేవా ట్రస్ట్, గాంధీ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు, మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయెన్స్ ఆధ్వర్యంలో సీపీఆర్​ శిక్షణకు శ్రీకారం చుట్టింది.

Training on CPR at Gandhi Hospital
Training on CPR at Gandhi Hospital
author img

By

Published : Jan 27, 2023, 9:20 PM IST

కార్డియాక్​ అరెస్ట్​.. CPR చేయడం ఎలా? గాంధీ ఆసుపత్రిలో 10 వేల మందికి ట్రైనింగ్

CPR Training at Gandhi Hospital: అప్పటివరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు.. క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది కార్డియాక్ అరెస్ట్. రెప్పపాటు కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు.. ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో కార్డియో పల్మనరీ రిసస్టేషన్(C.P.R) చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి సీపీఆర్​ తెలిసి ఉండాలంటున్నారు వైద్యులు.

ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి విద్యార్థుల సంఘం, గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయెన్స్, జనహితా సేవా ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి హాజరైన గవర్నర్‌ తమిళిసై.. సీపీఆర్​ వ్యక్తుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గతంలో తాను విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రయాణికుడికి సీపీఆర్​ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

"విదేశాల్లో 60 శాతం మందికి సీపీఆర్​పై అవగాహన ఉంటుంది. కానీ మన దేశంలో 2 శాతం మాత్రమే జనాలకు సీపీఆర్​పై అవగాహన ఉంది. కార్డియాక్ అరెస్ట్ అయిన వారిలో కొద్దినిమిషాల్లో వారికి సీపీఆర్​ చేస్తే వారి ప్రాణాలు కాపాడుకోగలం. ప్రభావంతమైన సీపీఆర్​ ఉంటే వెంటనే మనిషిని బతికించుకోగలం. ఈ ప్రయత్నం చేస్తోన్న అందరికి ధన్యవాదములు"- తమిళిసై సౌందర రాజన్‌, గవర్నర్‌

విదేశాల్లో 60శాతం మందికి సీపీఆర్‌పై అవగాహన ఉంటుంది. భారత్‌లో 2శాతం మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది. కార్డియాక్‌ అరెస్టు వచ్చిన కొన్ని నిమిషాల్లో సీపీఆర్‌ చేస్తే వ్యక్తిని బతికించుకోగలం. ఇది కూడా పూర్తిస్థాయిలో ఉండాలి. దీనిని ఎందుకు నేర్చుకోవాలంటే.. ప్రభావవంతమైన సీపీఆర్‌ ఉంటేనే ప్రాణాలు కాపాడుకోగలం. ఈ ప్రయత్నం చేస్తున్న అందరిని ప్రశంసిస్తున్నాను.

'కమ్యునిటీ హ్యాండ్స్.. ఓన్లీ సీపీఆర్' పేరుతో మూడ్రోజులపాటు సుమారు 10వేల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. గుండె ఆగినప్పుడు ఛాతి మధ్య భాగంలో రెండు చేతులను ఉంచి.. బలంగా క్రమపద్ధతిలో ఒత్తిడి తీసుకురావటం ద్వారా తిరిగి గుండెను పనిచేసేలా చేయటాన్నే సీపీఆర్​గా చెబుతారు. ఇది ఎలా చేయాలనే విషయంపై పరిజ్ఞానం లేకపోతే బాధితులకు మరింత సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు.

"కార్డియాక్​ అరెస్టు కావడానికి ఆడ, మగ అనే తేడా లేదు ఎవరికైనా వస్తోంది. అది వచ్చిన కొద్ది నిమిషాల్లోనే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ చేయాలి. దీంతో మనం రోగి ప్రాణాలు కాపాడుకోగలం. ఈ సమయానేే గోల్డెన్​ మినిట్స్​ అంటాం. సరైనా అవగాహనతో సీపీఆర్​ చేస్తే ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోగలం."-డా.మూర్తి, గాంధీ ఆస్పత్రి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ అడ్వైజర్

ఇందుకోసం జనహితా సేవా ట్రస్ట్ సభ్యులు ముందుగానే పలు విద్యా సంస్థలు, పోలీస్ స్టేషన్లకు వెళ్లి కార్యక్రమం గురించి వివరించారు. గంటసేపట్లోనే ఈ సీపీఆర్​ని నేర్చుకోవచ్చని అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటంతోపాటు.. నేరుగా గాంధీ ఆస్పత్రికి వచ్చి శిక్షణ పొందచ్చని స్పష్టం చేశారు. ఈ మూడ్రోజుల శిక్షణ కార్యక్రమం శనివారంతో పూర్తి కానుంది. కళ్లముందే ఓ ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనప్పుడు చిన్న టెక్నిక్ ద్వారా కాపాడచ్చని అందుకే సమాజంలో ప్రతి ఒక్కరు తప్పక సీపీఆర్ నేర్చుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.