ETV Bharat / state

చమురు ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం డిమాండ్​ - Tammineni Veerabhadram latest news

కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించారు. భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజలపై విపరీతంగా భారం వేస్తోందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే ఈ ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

CPM state secretary Tammineni Veerabhadram called for immediate reduction in oil prices
చమురు ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం డిమాండ్​
author img

By

Published : Feb 15, 2021, 9:01 PM IST

కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచడంతో ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే కేంద్రం విధిస్తున్న సెస్, తదితర పన్నులను రద్దు చేసి... వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గత 11 రోజుల్లోనే వంటగ్యాస్‌ ధరను రూ. 75లు పెంచడంతో సిలెండర్‌ ధర రూ. 821.50కు చేరుకుందని తమ్మినేని అన్నారు. ఓ వైపు పేద మహిళలకిచ్చే ఉజ్వల గ్యాస్‌ పథకానికి లబ్ధిదారులను పెంచుతామని కేంద్రం ప్రకటిస్తూనే... మరోవైపు పేదలకు అందుబాటులో లేని విధంగా ధరలను పెంచడాన్ని ఆయన తప్పు పట్టారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేక ఖాతాలో... నిధిని ఏర్పాటు చేసి చమురు ధరలు పెరిగినప్పుడల్లా వినియోగదారునిపై భారం పడకుండా సర్దుబాటు చేసేదని అన్నారు. కానీ నేడు ఆ ఖాతాలను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రజలపై అధిక భారం పడుతోందని తెలిపారు. తక్షణమే ఈ ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: వ్యవసాయ నిపుణులతో సుప్రీం కమిటీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.