ETV Bharat / state

'రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపరచాలి.. వలస కూలీలను ఆదుకోవాలి'

రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాల వినియోగంపై చేస్తోన్న కృషి కొనియాడదగినదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. కరోనా కేసుల విషయంలో రాష్ట్రంలో వైద్యసేవలు మరింత మెరుగుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

cpi state  secretary chada venkatareddy spoke on corona
'రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపరచాలని.. వలస కూలీలను ఆదుకోవాలి'
author img

By

Published : Apr 25, 2020, 3:49 PM IST

గోదావరి జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. రంగనాయక సాగర్​కు నీళ్లు రావడం శుభ పరిణామన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని.. రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేని ప్రజలు దాదాపు పది లక్షల మంది ఉన్నారని వారికి అన్ని సదుపాయాలు అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.