హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద ఆందోళనకు అఖిలపక్ష నేతలు పిలుపునివ్వడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రగతి భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా, తెజస, వామపక్షాల నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించి ఉన్నారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తే కేసీఆర్ పోలీస్ ఎమర్జెన్సీ విధించాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ పెట్టాల్సిన ప్రభుత్వం ఆందోళనలను అణిచి వేస్తోందన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణిచివేయడం దారుణమని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అని చాడ ప్రశ్నించారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం