హైదరాబాద్ సరూర్‌నగర్ నాళాలో పడి చనిపోయిన నవీన్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సరూర్ నగర్ చెరువు ప్రాంతాన్నీ ఆయన పరిశీలించారు.
జంట నగరాల్లో మనిషికి రక్షణలేని పరిస్థితి ఏర్పడిందని చాడ ఆరోపించారు. నాళాలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం వల్లే ఎక్కడికక్కడ వరదనీరు నిలిచిపోతోందన్నారు. ప్రభుత్వం సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే జంటనగరాలు నరక కూపాలుగా మారిపోయే ప్రమాదముందన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్