తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో సీపీఐ ర్యాలీ నిర్వహించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ముగ్దూం మోహియుద్దీన్ విగ్రహం ముందు సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎరుపు రంగు చొక్కాలు ధరించి నివాళులర్పించారు. నైజాం నిరంకుషత్వ పాలన నుంచి విముక్తి కోసం సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరులు రావి నారాయణరెడ్డి, ముగ్దూం మోహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డికి విప్లవాభివందనాలు చేశారు. సీపీఐ చేసిన సాయుధ పోరాటం ఫలితంగానే నాటి నిజాం నిరంకుశ పాలన రద్దయిందని నేతలు తెలిపారు. పోరాట యోధుల జీవితాలు నేటితరానికి స్ఫూర్తని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: మీ 'బాస్'కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?