ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా ప్రధాన నేతలు ఓటమి పాలయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పశ్చిమ బంగ, కేరళ, తమిళనాడులో ఆ పార్టీకి డిపాజిట్లు కరవయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వారి స్థాయికి దిగజారి మాట్లాడి భంగపడ్డారని విమర్శించారు.
తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు బెడిసికొట్టిందని పేర్కొన్నారు. కేరళలో కమ్యునిస్టులను ఎన్నికల సమయంలో ఎంతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. భవిష్యత్తులో భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి