ETV Bharat / state

పంచభూతాలను ప్రైవేటీకరించేందుకు వెనుకాడరు: నారాయణ

ఇస్రోని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం 2017 నుంచే ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం పంచభూతాలను ప్రైవేటీకరించేందుకు వెనుకాడడంలేదని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Jun 26, 2020, 10:00 PM IST

Cpi narayana comments on isro
పంచభూతాలను ప్రైవేటీకరించేందుకు వెనుకాడరు: నారాయణ
పంచభూతాలను ప్రైవేటీకరించేందుకు వెనుకాడరు: నారాయణ

ఇస్రోను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఆత్మహత్యా సదృశ్యంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పంచభూతాలను ప్రైవేటీకరించేందుకు వెనుకాడడంలేదని ఎద్దేవా చేశారు. అంతరిక్ష రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదని విమర్శించారు. దేశ భద్రతలో ఆంతరిక్షం చాలా కీలకమైన భాగమని పొరుగు దేశాల నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ వ్యక్తులను అనుమతించడం దేశానికి ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు.

2017 నుంచే..

ఇస్రోని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం 2017 నుంచే ప్రయత్నిస్తోందని నారాయణ తెలిపారు. స్వతంత్ర డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇస్రోకు అత్యంత లాభదాయక వ్యాపారం వాణిజ్య ఉపగ్రహాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి ఇస్రో ఛైర్మన్ వంతపాడడం విచారకరమన్నారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: మీ ఓటు వద్దు... ప్రేమానురాగాలు చాలు: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.