లోక్సభ బరిలో సీపీఎం, సీపీఐ కలిసి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నాయి. పదేళ్ల తర్వాత కలిసిన కమ్యూనిస్టులు గడిచిన కాలంలో చాలా కోల్పోయామంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
ఇదీ చూడండి :'తెలుగువారి అభివృద్ధే మా ఎన్నికల నినాదం'