ETV Bharat / state

కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుదాం: చాడ - AITUC

మేడే సందర్భంగా హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని ఏఐటీయూసీ కార్యాలయం ముందు కార్మిక జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదామని శ్రామిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని విమర్శించారు.

cpi chada venkatreddy spoke on may day
కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుదాం: చాడ
author img

By

Published : May 1, 2020, 9:02 PM IST

కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడదామని... మేడే సందర్భంగా కార్మికవర్గానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 134 సంవత్సరాల క్రితం కార్మికవర్గం పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని.. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యంచేసే విధంగా చట్టాల్లో మార్పుల్ని తీసుకువచ్చాయని విమర్శించారు. మేడే సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం ముందు కార్మిక జెండాను వారు ఆవిష్కరించారు. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల్ని పట్టించుకోకుండా... కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని, కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితులు ప్రభుత్వాలు తెచ్చుకోవద్దని చాడ హెచ్చరించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని... వారిని ఆదుకోవడం మానేసి కేంద్ర ప్రభుత్వం కోట్లాది బ్యాంకు ఋణాలు ఎగవేసినవారికి వత్తాసు పలుకుతూ... ఋణాలు మాఫీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

అసంఘటితరంగ కార్మికుల్ని ఆదుకొనేందుకు ఇలాంటి కష్టకాలంలో నెలకు 5వేలు చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అనేకమంది వైద్య , మున్సిపల్ తదితర రంగాల కార్మికుల సేవలను గుర్తించి... పర్మినెంటు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో కార్మికుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ఆటో , భవననిర్మాణం , హమాలీ లాంటి అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా వారికి వేతనాలు చెల్లించాలని చాడ వెంకటరెడ్డి కోరారు.

ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్​డౌన్​ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.