కేసీఆర్ మేధస్సు నుంచి వచ్చిన మిషన్ భగీరథను పటిష్ఠంగా నిర్వహించాలంటే తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో పని చేస్తోన్న ఉద్యోగులను తొలగించడం వల్ల వారు గత నెల రోజులుగా ఆందోళన చెందుతున్నారన్నారు.
అనుభవం, సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లను విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉపాధి హామీ పనులు చురుకుగా సాగుతున్న తరుణంలో క్షేత్రస్థాయి సహాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వాళ్లను తొలగించాలే తప్పితే మూకుమ్మడిగా అందరిని తొలగించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్