ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా చిన్నారులను సంరక్షించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. జులైలో నిర్వహించిన ఆపరేషన్-5లో 541 మంది పిల్లల్ని రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో 483మంది బాలురు, 58 మంది బాలికలున్నారు. 62మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా.... 479 మంది చిన్నారులను ఆశ్రమాల్లో ఉంచారు. చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకున్న 247మంది యజమానులపైన కేసులు నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు. స్పిన్నింగ్ మిల్లు, మెటల్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ కంపెనీ, వెల్డింగ్ దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారులతో పాటు.. వీధుల్లో భిక్షాటన చేస్తున్న పిల్లల్ని తీసుకొచ్చి.... ఆశ్రమాల్లో ఉంచి చదివిస్తున్నామని సీపీ అన్నారు.
ఇదీ చూడండి :'జమ్ముకశ్మీర్‌పై కేంద్ర నిర్ణయం చారిత్రక మార్పు'