ETV Bharat / state

వారం రోజుల్లోనే నేపాల్​ గ్యాంగ్​ను పట్టుకున్నాం: సీపీ సజ్జనార్​ - నేపాల్​ గ్యాంగ్​ తాజా వార్తలు

రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠాను అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీపీ సజ్జానార్​ పేర్కొన్నారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. నిందితుల నుంచి రూ.5.20 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

CP Sajjanar talk about Rayadurgam theft case accused arrested
వారం రోజుల్లోనే నేపాల్​ గ్యాంగ్​ను పట్టుకున్నాం: సీపీ సజ్జనార్​
author img

By

Published : Oct 12, 2020, 12:57 PM IST

వారం రోజుల్లోనే నేపాల్​ గ్యాంగ్​ను పట్టుకున్నాం: సీపీ సజ్జనార్​

హైదరాబాద్‌ రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.5.20 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు.

బోర్‌వెల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా పని మనుషులుగా చేరారని తెలిపారు. యజమానులతో నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడ్డారని వివరించారు. ముఠాలో ప్రధాన నిందితుడు నేపాల్‌కు చెందిన నేత్రగా గుర్తించినట్లు ప్రకటించారు. ఈ గ్యాంగ్ ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి చోరీలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు.

దేశంలో పలు ప్రాంతాల్లో నేపాల్‌కు చెందిన ముఠా చోరీలకు పాల్పడిందని అన్నారు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించినట్లు పేర్కొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు యూపీ పోలీసులు బాగా సహకరించారన్నారు. వారం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. పని మనుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి ఆరా తీయాలని సూచించారు సీపీ సజ్జనార్.

ఇదీ చూడండి: రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.