లాక్డౌన్ దృష్ట్యా హైదరాబాద్‌లోని సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, ఆల్విన్ కాలనీల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సైబరాబాద్ సీపీ సజ్జనార్.. పరిశీలించారు. వాహనదారులను తనిఖీ చేసి సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై సీపీ కేసులు నమోదు చేశారు.
మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీకి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. వారంతా సరుకు రవాణా, అత్యవసర పనులపై వెళ్లే వాళ్లుగా గుర్తించిన అనంతరం వెళ్లడానికి అనుమతిస్తున్నారు. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉందని ప్రజలందరూ ఇంట్లోనే ఉండి రక్షణ చర్యలు తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జరిమానా వద్దు.. హెల్మెట్ ముద్దు.. అంటున్న పోలీసులు