రాచకొండ పరిధిలోని నేరెడీమేట్ కంటైన్మెంట్ జోన్ శ్రీకాలనీలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ పర్యటించారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటిటికి తిరిగి వారి సమస్యల గురించి ఆరా తీశారు.
యువకులు గుంపులుగా ఉన్నారో తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరా ఉపయోగిస్తున్నామని అన్నారు. ఎవ్వరూ కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. అక్కడ పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లను పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ రక్షిత, వైద్య, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వందేళ్ల ప్రస్థానం గల బొగ్గు గని మూసివేత