ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన గంటలో రక్తం అందక చాలా మంది మృతిచెందిన ఘటనలు ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టొచ్చన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన ఆటో డ్రైవర్లను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట