అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించిన హైదరాబాద్‌కు చెందిన దీప్తిని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అభినందించారు. అధిక వార్షిక వేతనం అందుకుంటూ రాష్ట్రానికే పేరు తెచ్చారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
దీప్తి.. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్వేర్ కొలువు సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేసిన దీప్తి.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈనెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ విద్యార్థినికి రూ.2 కోట్ల కొలువు'పై డీజీపీ హర్షం