ETV Bharat / state

వ్యక్తిగత రక్షణపైనా పోలీసులు దృష్టి పెట్టండి: సీపీ అంజనీకుమార్​ - హైదరాబాద్​

కరోనా నివారణ చర్యల్లో భాగంగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీసుల కృషిని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ కొనియాడారు. పాతబస్తీలో కొనసాగుతున్న కర్ఫ్యూ తీరును ఆయన సమీక్షించారు.

cp anjani kumar review meeting on police officers of old city at hyderabad
వ్యక్తిగత రక్షణపైనా పోలీసులు దృష్టి పెట్టండి: సీపీ అంజనీకుమార్​
author img

By

Published : Mar 27, 2020, 4:14 PM IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తోన్న పోలీసుల కృషిని నగర సీపీ అంజనీ కుమార్ అభినందించారు. లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ కొనసాగుతోన్న తీరును సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సౌత్ జోన్ పోలీసులతో సమావేశమయ్యారు. జనసమూహాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటూనే.. వ్యక్తిగత రక్షణపై పోలీసులు దృష్టి పెట్టాలని అంజనీకుమారు సూచించారు.

వైరస్ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక.. పోలీసులు అలసిపోకుండా షిప్టు డ్యూటీలు అమలు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. విధినిర్వహణలో తప్పనిసరిగా వ్యక్తిగత శానిటేషన్, సామాజిక దూరం పాటించడం మరవొద్దని పోలీసులకు సీపీ దిశానిర్దేశం చేశారు.

వ్యక్తిగత రక్షణపైనా పోలీసులు దృష్టి పెట్టండి: సీపీ అంజనీకుమార్​

ఇవీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.