Loan App Harassments in Medak : ఎవరైనా ఏదైనా ఓ నెల అవసరాలకు డబ్బు రొటేషన్ కానప్పుడు స్నేహితుల దగ్గరో లేదంటే తెలిసిన వారి వద్దనో నగదును బదులు, అప్పు కింద తీసుకుంటారు. ఎవరూ సహాయం చేయనప్పుడు నేరుగా క్షణాల్లో డబ్బును అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే లోన్‌యాప్‌లను సంప్రదించి లోన్ తీసుకుంటారు. అయితే ఆ లోన్‌యాప్ వడ్డీలు కట్టలేక కొందరు ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.
పురుగుల మందే దిక్కు! : లోన్‌యాప్ నిర్వాహకుల ఒత్తిడి కారంణంగా ఓ అమాయక యువకుడు బలైన ఉదంతమిది. వారి వేధింపులకు మద్ది గంగాధర్ (30) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని కాట్రియల గ్రామంలో జరిగింది. గంగాధర్ మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
లోన్యాప్లో తన అవసరాల నిమిత్తం పలు దఫాలుగా సుమారు రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. అవి తీర్చకపోవడంతో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయి. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు మూడు రోజుల క్రితం పొలంలో ఉపయెగించే పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి కాస్తా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తనువు చాలించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఫోటో మార్ఫింగ్‌ను అరికట్టే వెబ్‌సైబ్ - మిమ్మల్నీ మీరే కాపాడుకోండిలా!
లోన్ యాప్‌ల ఉచ్చులో పడకండి - జీవితాన్ని ఆగం చేసుకోకండి - Loan App Harassments in telangana