లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో మహేంద్ర ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థ ఉచితంగా క్యాబ్ సర్వీసులను అందించేందుకు ముందుకు వచ్చింది. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి క్యాబ్ సేవలను ప్రారంభించారు. ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సేవలున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సేవలను అందించనున్నట్లు వారు పేర్కొన్నారు. సీనియర్ సిటిజెన్స్, గర్భిణీలకు, పిల్లల ఆరోగ్య సమస్యలు, అత్యవసర సేవల కోసం నిరంతరం 7 క్యాబ్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచామన్నారు. క్యాబ్ బుకింగ్ కోసం 8433958158 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
ఇవీచూడండి: 'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'