ETV Bharat / state

నిత్యావసరాలను పంపిణీ చేసిన సీపీ అంజనీ - పలువురికి సరకులను అందజేసిన సీపీ అంజనీకుమార్​

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జంటనగరాల్లో రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర సీపీ అంజనీకుమార్‌ సూచించారు. బేగంపేట రసూల్‌పుర వద్ద పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.

cp anjani distirbuted the essentials in begumpet hyderabad
నిత్యావసరాలను పంపిణీ చేసిన సీపీ అంజనీ
author img

By

Published : Apr 16, 2020, 6:49 PM IST

బేగంపేట రసూల్‌పుర వద్ద పలువురికి సీపీ అంజనీకుమార్‌ నిత్యావసరాలను అందజేశారు. గ్రీన్‌లాండ్స్‌, పంజాగుట్ట ప్రాంతాల్లోని పోలీస్​ చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి అంజనీకుమార్‌ పండ్ల రసాలను పంపిణీ చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

నిరాశ్రయులు, వలస కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం తాగునీరు అందించడం అభినందనీయమన్నారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి అంజనీకుమార్‌ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ వాహనంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

ఇదీ చూడండి : అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.