గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వార్డు సహా... ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన సదుపాయాలను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. గాంధీలో 160 పడకలతో ఏర్పాటైన వార్డు, ఆక్సిజన్ జనరేటర్లను సీఎస్ ప్రారంభించారు.
గాంధీలో రోజురోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పడకలు లేక బాధితులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాయేజ్ని సీఎస్ సందర్శించారు. ప్రారంభించిన ఆక్సిజన్ జనరేటర్ ద్వారా 400 మందికి నిరంతరంగా ప్రాణవాయువుని సరఫరా చేసే అవకాశం ఏర్పడింది.
కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు... పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డీఎంఈ రమేశ్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు