ETV Bharat / state

కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

author img

By

Published : Jul 25, 2020, 6:31 AM IST

ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్యకూ వైరస్‌ ఉన్నట్లు తేలగా, పిల్లలిద్దరికీ కరోనా సోకలేదు. లక్షణాలు లేకపోవడం వల్ల ఇంట్లోనే చికిత్స తీసుకోమని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. ఇంటికెళ్లాడు గానీ.. ఏం మందులు వాడాలి? ఎవరిని సంప్రదించాలో అంతా అయోమయ పరిస్థితి. చివరకు తెలిసిన వారి ద్వారా ఒక వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించారు. ఆయన సూచించిన మందులు తెచ్చేవారు లేక తానే దుకాణానికి వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చింది.

covid patients facing problems from tests to treatment
కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

కరోనా లక్షణాలున్నవారికి పరీక్షలు మొదలుకొని చికిత్స పూర్తయ్యే వరకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి? ఇంట్లో ఉంటే చికిత్స ఎలా? ఏ ఆసుపత్రికి వెళ్లాలి?ఎలా వెళ్లాలి?.. ఒకటని కాదు.. ఇలాంటి పలు సందేహాలతో కొవిడ్‌ బాధితులు నిత్యం సతమతమవుతున్నారు. వైరస్‌ సోకిన దానికంటే ఈ సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ నియంత్రణ, నిర్ధారణ, చికిత్సలపై ఉన్నతస్థాయిలో అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కార్యాచరణలోకి వచ్చేసరికి అవి పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. దీంతో కొవిడ్‌ బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదు.

పరీక్షలకు ఎక్కడికెళ్లాలి?

లక్షణాలు కనిపించగానే.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలనే స్పష్టత ఇప్పటికీ ప్రజల్లో లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఏరియా ఆసుపత్రుల్లో, అలాగే జిల్లాల్లోనూ కేంద్ర ఆసుపత్రులు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఇంకా అది ప్రజల్లోకి చేరడంలేదు. కొన్నిచోట్ల పరిమిత సంఖ్యలోనే పరీక్షలు చేయడం కూడా సమస్యగా మారింది. ఉదాహరణకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 25 పరీక్షలు మాత్రమే చేస్తామని అక్కడి సిబ్బంది చెబుతుండగా.. పొద్దున్నే ఆరు గంటలకే పరీక్షల కోసం నిలబడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. దీంతో వరుసల్లో నిలబడి కూడా పరీక్షలు చేయించుకోకుండానే కొందరు ఇళ్లకెళ్తున్నారు. ఎక్కడ పరీక్షలు చేస్తారనే విషయాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఎవరిని సంప్రదించాలనే స్పష్టత లేక.. చదువుకున్న వారు కూడా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

సూచన : అప్పుడప్పుడు విలేకరుల సమావేశాల్లో పరీక్షల నిర్వహించే కేంద్రాల సంఖ్యను చెబుతున్నారే తప్ప.. అవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే స్పష్టత కొరవడింది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పరీక్ష కేంద్రాలు, వాటి పని వేళలతో కూడిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. వీలైతే ‘కొవిడ్‌ యాప్‌’ను ప్రత్యేకంగా రూపొందించి, అందులో పరీక్ష కేంద్రాల సమాచారం సహా ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ చేయాలి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకూ నమూనాలను స్వీకరిస్తారనే స్పష్టత కూడా ఇవ్వాలి. ఆ నిర్దేశించిన సమయాల్లో ఎంతమంది లక్షణాలున్నవారు పరీక్షల కోసం వచ్చినా.. నిరాకరించకుండా పరీక్షలు నిర్వహించాలి.

ఫలితాలు.. ఫలిత పత్రాల్లోనూ జాప్యం

కొవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేస్తున్నప్పుడు.. పెద్దఎత్తున నమూనాలు సేకరించినా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందనే విమర్శలొచ్చాయి. అయితే యాంటీజెన్‌ పరీక్షలను ప్రారంభించాక.. 30 నిమిషాల్లోపే ఫలితాలు వెల్లడవుతాయని వైద్యశాఖ ప్రకటించినప్పుడు ఇక సమస్య తీరిపోతుందని భావించారు. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల.. పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో ల్యాబ్‌టెక్నీషియన్లలోనూ ఎక్కువమంది కొవిడ్‌ బారినపడుతున్నారు. ఈ ప్రభావం యాంటీజెన్‌ పరీక్షల ఫలితాలపై పడుతోంది.

30 నిమిషాల్లోపు వెల్లడవ్వాల్సిన యాంటీజెన్ పరీక్షల ఫలితం కొన్నిచోట్ల సాయంత్రానికి చెబుతున్నారు. దానికోసం మరోసారి ఆసుపత్రికి రమ్మంటున్నారు. లేదంటే గంటల తరబడి ఆసుపత్రిలోనే ఉండి పోవాల్సి వస్తోంది. ఒకవేళ పాజిటివా? నెగిటివా? అనేది చెప్పినా.. ఆ ఫలిత పత్రం మాత్రం వెంటనే ఇవ్వడం లేదు. కొందరికి 10 రోజులైనా కూడా ఫలిత పత్రం అందకపోవడం గమనార్హం. ఇటువంటి వారు వందల సంఖ్యలో ఉంటున్నారు. వీరిలో కొందిరికి కొన్ని రోజులు గడిచాక.. సమస్య తీవ్రమై ఆసుపత్రిల్లో చేరాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటప్పుడు ఫలిత పత్రం అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

సూచన: పరీక్షల నిర్వహణకు తగ్గట్లుగా అదనంగా ల్యాబ్‌టెక్నీషియన్లను నియమించుకోవాలి. వైరస్‌ బారినపడడానికి వీరికే అధికశాతం అవకాశాలుంటాయి. ఈవిషయం తెలిసినప్పుడు.. ఇద్దరు పనిచేయాల్సిన చోట నలుగురిని అందుబాటులో పెట్టుకోవాల్సిన అవసరముంది. ఫలితం వెల్లడవగానే వెంటనే ఫలిత పత్రం కూడా అందించేందుకు వీలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను, ముద్రిత పరికరాలను కూడా సమకూర్చుకోవాలి. పరీక్ష నిర్వహించడానికి ముందే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు గనుక.. ఫలితం వెల్లడవగానే అప్పటికప్పుడే ముద్రిత పత్రాన్ని కూడా ఇవ్వవచ్చు.

మందులెవరిస్తారు?

నెగిటివ్‌ అని తెలిస్తే ఫరవాలేదు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే ఆందోళన మొదలవుతుంది. లక్షణాలు ఏమీ లేకపోయినా, స్వల్పంగా ఉన్నా ఇంటి వద్దనే చికిత్స పొందాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నారు. ఇంట్లో ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నవారికి కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఒకవైపు కొవిడ్‌ సోకిందనే ఆందోళన.. మరోవైపు ఏం చికిత్స పొందాలో తెలియని అయోమయం. ఏం తినాలో.. ఏం తినకూడదో.. ఎలా ఉండాలో అంతా గందరగోళం. తెలిసిన వారి ద్వారా ఏదోరకంగా మందుల సమాచారం తెలుసుకున్నా.. వాటిని కొనుక్కోవడం మహా కష్టం. కొవిడ్‌ అని తెలిశాక బయటకు వెళ్లలేరు. ఈ పరిస్థితుల్లో కరోనా బాధితులే బయటకొచ్చి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ మందులు కూడా ఎంత మోతాదులో వాడాలో.. అవి అసలు సరైనా ఔషధాలో కావో కూడా తెలియకుండా వాడుతున్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

సూచన: ఇంటింటికి ఔషధాలు సరఫరా చేస్తామని ఆరోగ్యశాఖ ప్రకటించినా.. అది పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. మందులను ఇంటింటికి ఇవ్వడమే కాకుండా.. అవి ఎలా వాడుకోవాలో కూడా చెప్పాలి. అయినా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే.. అక్కడే ఇంట్లో చికిత్స పొందాల్సిన వారికి మందులు కిట్‌ను అందజేస్తే ఇంత కష్టం ఉండదు. అందుకు తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.