ETV Bharat / state

గల్లీల్లో కరోనా విలయ తాండవం - more cases in small colonies in hyderabad

భాగ్యనగరంలోని గల్లీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇరుకు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. అందరూ కలిసి ఉండటం వల్ల కొవిడ్ వేగంగా వ్యాపిస్తోంది. విషయం గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.

hyderabad small colonies have more corona cases
ఇరుకు గల్లీల్లో బెరుకు
author img

By

Published : Jun 2, 2020, 7:44 AM IST

గర గల్లీల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇరుకు ప్రాంతాలు కావడంతో స్థానికుల్లో బెరుకు పెరుగుతోంది. ఇళ్ల మధ్య ఎడం ఉండకపోవడం, అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైద్యులు కూాడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఇద్దరు పీజీ వైద్యులకు సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారు నివసించే వసతి గృహంలోని వారిని క్వారంటైన్‌ చేశారు. సోమవారం గ్రేటర్‌ వ్యాప్తంగా 79 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.

గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు మృతిచెందగా వీరంతా నగరవాసులే కావడం గమనార్హం. మృతుల్లో మూడున్నర నెలల పాపతోపాటు, 39 ఏళ్ల మహిళ ఉన్నారు. భోలక్‌పూర్‌, ముషీరాబాద్‌, జియాగూడలో కేసులు తగ్గడం లేదు. తొలి కరోనా కేసు నమోదైన మహేంద్రహిల్స్‌లో సోమవారం దంపతులకు కరోనా ఉన్నట్లు తేలింది. భర్త గాంధీ ఆసుపత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఫీవర్‌ ఆసుపత్రికి అనుమానితుల తాకిడి కొనసాగుతోంది. సోమవారం 20 మంది చేరారు. వారాంతపు సంతలు, మాంసపు దుకాణాలు, కిరాణా షాపుల వద్ద నిబంధనలు పక్కాగా అమలు చేస్తే వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

‘గాంధీ’లో అదనంగా 350 పడకలు

గాంధీలో రోగులు తాకిడి పెరుగుతుండటంతో ఆమేరకు ఏర్పాట్లు చేయాలని గాంధీ ఆసుపత్రి అధికారులు నిర్ణయించారు. అదనంగా మరో 350 పడకలను సిద్ధం చేస్తున్నారు. మెడికల్‌ కళాశాల కొత్త లైబ్రరీ భవనంతోపాటు ఓపీ బ్లాకులో వీటిని సర్దుబాటు చేస్తున్నారు. సోమవారం డిశ్ఛార్జి అయిన వారితో కలిసి ఇప్పటివరకు 1600 మందికి ఇళ్లకు వెళ్లారు. కొత్త ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం...కరోనా నిర్ధారణ అయినా...ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌కు పంపొచ్చు. ఈమేరకు ఇక్కడున్న వారిలో 315 మంది జాబితాను సిద్ధం చేశారు. ఇలాంటి వారు ఇంట్లో రెండు వారాలపాటు గడపాలి. ఎలాంటి కరోనా లక్షణాలు గుర్తించినా వైద్యులను సంప్రదించాలి.

గ్రేటర్‌లో 280 కట్టడి గృహాలు!

కొత్త మార్గదర్శకాల ప్రకారం కంటెయిన్‌మెంట్‌ జోన్ల ఆంక్షలను బాధితుల ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. వాటిని కంటెయిన్‌మెంట్‌ హోమ్స్‌(కట్టడి గృహాలు)గా పిలుస్తున్నారు. సోమవారం నాటికి ఇలాంటివి నగరంలో 280 గృహాలున్నాయి. ఒకే ప్రాంతంలో సమీపంలో రెండు, అంతకు మించి ఇళ్లలో పాజిటివ్‌ కేసులు నమోదైనప్పుడు.. ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.