ETV Bharat / state

రేపటి నుంచే బూస్టర్​ డోసు.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: డీహెచ్​ - covid booster dose from tomorrow

Covid Booster dose: 18 ఏళ్లు పైబడిన వారికి ఆదివారం నుంచి కొవిడ్​ బూస్టర్​ డోసు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులో నిర్వహించిన పీస్​ రన్​కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

covid booster dose
కొవిడ్​ బూస్టర్​ డోసు
author img

By

Published : Apr 9, 2022, 9:36 AM IST

Updated : Apr 9, 2022, 9:58 AM IST

రేపటి నుంచే బూస్టర్​ డోసు.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: డీహెచ్​

Covid Booster dose: రేపటి(ఆదివారం ఏప్రిల్​ 10) నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బూస్టర్‌ డోసు టీకా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రెండో టీకా తీసుకుని 9 నెలలు నిండిన వారు ఇందుకు అర్హులని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకోవడం కీలకమని ఆయన సూచించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంతగా ప్రభావం చూపకపోవడానికి వ్యాక్సినేషనే కారణమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు.

5కే రన్​: హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లో జలవిహార్​ వద్ద.. సీవీఆర్​ కళాశాల సెన్సేషియా 'పీస్ రన్​' పేరుతో నిర్వహించిన 5కే పరుగులో డీహెచ్​ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జెండా ఊపి పరుగు​ ప్రారంభించారు. దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సే నో టూ డ్రగ్స్ ప్లకార్డులతో విద్యార్థులు పరుగు తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఎంతో ముఖ్యమని... శాంతి పేరుతో నిర్వహిస్తున్న ఈ పరుగు అభినందనీయమని డీహెచ్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులు, యువతలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.

"కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఏళ్లు పైబడిన, రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారికి రేపటి నుంచి బూస్టర్​ డోసు ప్రారంభమవుతుంది. మూడో దశలో కొవిడ్​ ఉద్ధృతి తగ్గడానికి కారణం వ్యాక్సిన్ తీసుకోవడమే. కరోనా విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకోవడం చాలా కీలకం. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి." -శ్రీనివాస రావు, డీహెచ్​

ఇదీ చదవండి: 18+ వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్​- ఆదివారం నుంచే...

Last Updated : Apr 9, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.