ETV Bharat / state

నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్‌ ప్రయోగాలు

కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు నిమ్స్​లో కొనసాగుతున్నాయి. ఇ్పపటివరకు 900 మంది వాలంటీర్లకు తొలి డోస్​ ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం తెలిపింది. మరో 200 మంది వాలంటీర్లకు డోస్​ ఇవ్వనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

covexin-vaccine-clinical-trials-continues-in-nims-hospital
నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్‌ ప్రయోగాలు
author img

By

Published : Dec 22, 2020, 7:09 AM IST

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా సోమవారం 15 మంది వాలంటీర్లకు తొలి డోస్‌ ఇచ్చారు. ఇప్పటివరకు 900 మంది వాలంటీర్లకు తొలి డోస్‌ ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది. తొలి డోస్‌ ఇచ్చి.. 28 రోజులు పూర్తయిన 20 మంది వాలంటీర్లకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చామని తెలిపారు. మరో 200 మంది వాలంటీర్లకు డోస్‌ ఇవ్వనున్నామని, ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.