Bandi Sanjay- Akbaruddin: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై విచారణ జరిపింది. ఎస్సార్‌నగర్ పోలీసులు వేసిన వేర్వేరు ఛార్జిషీట్లను విచారణకు స్వీకరించింది. ఏప్రిల్ 6న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్, అక్బరుద్దీన్‌ను ఆదేశించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులు కూలుస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారని అభియోగం నమోదైంది. అలాగే దారుస్సలాంలో ఎంఐఎం కార్యాలయం నేలమట్టం చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారని పోలీసులు అభియోగం నమోదు చేశారు. 2020 నవంబరులో నమోదు చేసిన ఈ కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్లు విచారణ అర్హతలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ వాదనలు విన్న న్యాయస్థానం... విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేసింది.
ఇదీ చూడండి:
MGM INCIDENT: ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు..
'ఏ వైరస్ వచ్చినా తగ్గేదేలే'.. డీహెచ్ పుష్ప డైలాగ్ అదుర్స్..