ETV Bharat / state

వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు - చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన జంట

అప్పు తీర్చలేని తండ్రి నిస్సహాయత ఓ కూమార్తెకు శిక్ష వేసింది. చేసిన అప్పు తీర్చలేక తన కుమార్తెను పెంచుకోమని ఇస్తే... చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది ఓ జంట. ఒంటి నిండా వాతలు పెట్టి, ఇంటెడు చాకిరి చేయించుకున్న ఆ దంపతుల కర్కశత్వం చివరికి కటకటాల పాలైంది.

couple tortured 7 years baby at kachiguda
వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు
author img

By

Published : Feb 25, 2020, 9:56 AM IST

హైదరాబాద్​ తిలక్​నగర్ ఇందిరానగర్‌లో వ్యాపారి మహిపాల్‌సింగ్‌, ఆశాకౌర్‌లు నివాసముంటున్నారు. అప్పు తీర్చలేక ఓ తండ్రి తన కూమార్తెను నాలుగేళ్ల క్రితం పెంచుకోవడానికి మహిపాల్​కు ఇచ్చాడు. పెంచుకుంటామంటూ ఆ దంపతులు చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. పైకి ప్రేమను నటిస్తూ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి నుంచి చిన్నారితో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా ఒంటినిండా వాతలు పెట్టి... తాళ్లతో బంధించేవారు.

విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధి నాగరాజు ఫిర్యాదుతో దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

మహిపాల్‌సింగ్‌ వద్ద ఓ తండ్రి తాను తీసుకున్న రూ.50 వేల అప్పును తీర్చలేక కుమార్తెను ఇచ్చేశాడని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు.

వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు

ఇవీ చూడండి: అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.