ETV Bharat / state

'వైద్యవిద్యలో క్రీడా కోటా అమలుపై కౌంటర్ దాఖలు చేయండి' - బీడీఎస్

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల అడ్మిషన్​ల ప్రక్రియలో క్రీడల కోటా అమలుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

SPORTS_QUOTA
author img

By

Published : Jul 5, 2019, 9:35 AM IST

ఈ ఏడాది అడ్మిషన్​ల ప్రక్రియ నిమిత్తం కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిపికేషన్​లో క్రీడల కోటాను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మామిడాల సంజన అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది గోపాలరావు వాదనలు వినిపించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్​లలో 0.5శాతం కోటా రిజర్వేషన్​ కల్పించిందన్నారు. గత సంవత్సరం క్రీడా కోటాల్లో అక్రమాలున్నాయంటూ... దాన్ని అమలు చేయరాదంటూ హైకోర్టు పేర్కొందన్నారు. అయితే అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా కొత్త విధానాన్ని రూపొందించాలని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. దానికి విరుద్ధంగా ఈ ఏడాది కూడా క్రీడా కోటాను అమలుచేయడంలేదన్నారు. ఇందుకు సంబంధించి క్రీడలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం కూడా ఎలాంటి జీఓను జారీచేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

'వైద్యవిద్యలో క్రీడా కోటా అమలుపై కౌంటర్ దాఖలు చేయండి'

పిటిషనర్ జూడో క్రీడలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా...నీట్​లో కూడా అర్హత సాధించారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం క్రీడా కోటా అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ,కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.