ETV Bharat / state

శభాష్​ కార్పొరేటర్..​ వర్షపు నీరు నిలవకుండా ఇప్పటినుంచే ​ముందస్తు చర్యలు - ghmc news

మన్సూరాబాద్ డివిజన్​లో ముందుచూపుతో వర్షాకాలంలో ఎక్కడా కూడా నీరు నిలవకుండా స్థానిక కార్పొరేటర్​ కొప్పుల నర్సింహారెడ్డి చర్యలకు ఉపక్రమించారు. ముందస్తు చర్యలు చేపట్టేందుకు జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్​ విభాగం అధికారులతో కలిసి ఆయా కాలనీల్లో ఆయన పర్యటించారు. పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

వర్షపు నీరు నిలవకుండా ఇప్పటినుంచే కార్పొరేటర్​ ​ముందస్తు చర్యలు

author img

By

Published : Apr 22, 2022, 7:48 PM IST

గ్రేటర్​ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్​లో ముందుచూపుతో వర్షాకాలంలో ఎక్కడా కూడా నీరు నిలవకుండా స్థానిక కార్పొరేటర్​ కొప్పుల నర్సింహారెడ్డి చర్యలకు ఉపక్రమించారు. ముందస్తు చర్యలు చేపట్టేందుకు జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్​ విభాగం అధికారులతో కలిసి ఆయా కాలనీల్లో ఆయన పర్యటించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. డివిజన్​లో క్షేత్రస్థాయిలో కలియతిరుగుతూ పలు కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇంజినీరింగ్​ విభాగం అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్​ విభాగం అధికారులు ఈఈ రమేశ్​ బాబు, ఏఈ ఈశ్వర్, డబ్ల్యూఐ సీతారామ్, ఆయా కాలనీ వాసులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

అధికారులకు సూచిస్తున్న కార్పొరేటర్​
అధికారులకు సూచిస్తున్న కార్పొరేటర్​

అధికారులకు కార్పొరేటర్​ సూచించిన సమస్యలు

  • చంద్రపురి కాలనీ రోడ్ నెం.5 చందన హోమ్స్ అపార్ట్మెంట్ వద్ద వర్షపు నీరు నిలవకుండా సీనియర్ సిటిజన్స్ భవనం రోడ్డు మార్గం నుంచి కాకతీయ స్కూల్ నాలా వరకు స్టార్మ్ వాటర్ డ్రైన్​ను నిర్మించాలని సూచించారు.
  • సెంట్రల్ బ్యాంక్ కాలనీ రోడ్ నెం.19 నుంచి శ్రీనగర్ కాలనీ వరకు నిలిచే వరద నీరు ఆ ప్రాంతంలో నిలవకుండా చిన్న చెరువులోకి మళ్లించాలని ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
  • సహారా స్టేట్స్ వెనకాల ఆటోనగర్ నగర్ రోడ్డులో జడ్జస్ కాలనీ నుంచి హిమపురి కాలనీ ఫేజ్-2 వద్ద ఆగిన బాక్స్ నాలా పనులను సెవెన్ హిల్స్ కాలనీ వరకు వర్షాకాలం లోపు నిర్మించాలని అన్నారు.
  • రానున్న వర్షాకాలంలో గణేష్ నగర్ కాలనీ, సాయినాథ్ కాలనీ ముంపునకు గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కాలనీ వాసుల సమక్షంలో అధికారులకు సూచించారు.
  • హయత్ నగర్ సీఆర్​ఐడీఏ వ్యవసాయ క్షేత్రం నుంచి బాలాజీ నగర్, టీ- నగర్, కేవీఎన్​ రెడ్డి నగర్, ఎల్లారెడ్డి కాలనీ మీదుగా లక్ష్మీ భవానీ హత్తిగూడ చెరువు వరకు.. అక్కడి ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నాలా నిర్మించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.