ముషీరాబాద్ డివిజన్లో కొవిడ్ బాధితులకు పీపుల్స్ ఫర్ హెల్ప్ చిల్ట్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 11 రకాల నిత్యావసర సరకులు అందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ పాల్గొన్నారు.
రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని... ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని కార్పొరేటర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంతోశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు