ETV Bharat / state

తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి కార్పొరేట్​ ఆరోగ్య బీమా - ktr birthday

మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా వెయ్యిమంది ఈవీడీఎం సిబ్బందికి తలసాని ట్రస్ట్​ ఆధ్వర్యంలో కార్పొరేట్​ ఆరోగ్య బీమా చేయించారు. ఈవీడీఎం సిబ్బందికి తెరాస నేత తలసాని సాయికిరణ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పత్రాలను అందజేశారు.

Corporate health insurance for EVDM staff on behalf of Talasani Trust for ktr birthday
తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి కార్పొరేట్​ ఆరోగ్య బీమా
author img

By

Published : Jul 24, 2020, 4:50 PM IST

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది ఈవీడీఎం సిబ్బందికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆరోగ్య బీమా చేయించారు. బుద్దభవన్​లో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ సమక్షంలో తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్​ పత్రాలను తెరాస నేత తలసాని సాయికిరణ్ అందించారు.

కార్పొరేట్ ఆస్పత్రుల్లో వెయ్యి మంది ఈవీడీఎం సిబ్బంది రూ 2 లక్షలు వరకు వైద్య సేవలు పొందొచ్చని సాయికిరణ్​ తెలిపారు. రూ 20 కోట్ల విలువైన కార్పొరేట్ వైద్య సేవలు అందించుటకు హెల్త్ ఇన్సూరెన్స్​ ప్రీమియంగా తలసాని ట్రస్ట్​. 35 లక్షలు చెల్లించిందని వెల్లడించారు. బీమా చేయించిన తలసాని ట్రస్ట్​కు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: కేటీఆర్​ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.