ETV Bharat / state

కరోనా కలవరం.. ప్రైవేటులో కొవిడ్‌ రోగుల కిటకిట! - హైదరాబాద్‌లో ప్రైవేట్ కరోనా ఆస్పత్రులు

కరోనా భయంతో లక్షణాలు లేకున్నా పరీక్షలకు మొగ్గు చూపడంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా చాలామంది ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. గతంతో పోల్చితే ఓపీలు అమాంతంగా పెరిగాయి.

CORONA
CORONA
author img

By

Published : Jun 19, 2020, 7:45 AM IST

జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులకు చికిత్స చేసేందుకు 50 వరకు ఐసోలేషన్‌ పడకలు కేటాయించారు. ప్రస్తుతం ఇవన్నీ నిండిపోయాయి. కొందరికి ఇప్పటికే పాజిటివ్‌ రావడంతో చికిత్స పొందుతున్నారు. మరికొందరిలో లక్షణాలతో చేరారు.

సోమాజిగూడ, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌లోని మరో 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 చొప్పున ఐసోలేషన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నిండిపోయాయి. కరోనా చికిత్సకు రెండు, మూడు రోజులు నిరీక్షిస్తే తప్ప పడకలు లభించడం లేదు.

లాక్‌డౌన్‌తో ఇప్పటివరకు వెలవెలబోయిన ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రస్తుతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా చాలామంది ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. గతంతో పోల్చితే ఓపీలు అమాంతంగా పెరిగాయి. కరోనా కారణంతో సాధారణ ఫ్లూను సైతం అనుమానించాల్సి వస్తోందని ఓ వైద్యుడు తెలిపారు. లక్షణాలు కన్పించిన వెంటనే శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. అంతవరకు ఆసుపత్రిలోనే ఐసోలేషన్‌లో రోగులను ఉంచుతున్నారు. కొవిడ్‌ లేకపోతే జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపుతున్నారు. పాజిటివ్‌ అని తేలితే తగ్గే వరకు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య బీమా ఉన్న రోగులు చికిత్సల్లో 70 శాతం వరకు ఖర్చులు బీమా ద్వారా క్లెయిం చేసుకోవచ్చంటున్నారు. పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి రోగి జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. బీమా లేకపోతే కనీసం రూ.1.20 లక్షల నుంచి ఇంకా ఎక్కువే బిల్లుల భారం పడుతోంది.

ఇంట్లో పరీక్షలకు ఆసక్తి...

కరోనా భయంతో లక్షణాలు లేకున్నా పరీక్షలకు మొగ్గు చూపుతున్నారు. ఆసుపత్రిలో వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందనే అనుమానంతో చాలామంది ఇంటి వద్దే శాంపిళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ధరలు ప్రకారం ల్యాబ్‌ వద్దకు వచ్చి టెస్టు చేయించుకుంటే రూ.2200, ఇంటికి వచ్చి శాంపిళ్లు సేకరిస్తే రూ.2800 ధరలుగా నిర్ణయించింది. వీటికి తాము చేయలేమని పలు ల్యాబ్‌లు పేర్కొంటున్నాయి. కొన్ని ఆస్పత్రుల వారు ఇంటికొచ్చి కరోనా పరీక్ష చేయాలంటే రూ.5 వేల వరకు అవుతుందంటున్నారు.

పీపీఈ కిట్లు.. ఇతర అదనపు బిల్లుల మోత...

ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి పరీక్షలు చేస్తారు. అనంతరం పాజిటివ్‌ అని తేలితే చికిత్స వేళ పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు(పీపీఈ) ఎంతో కీలకం. వైద్యులు, నర్సులు, సిబ్బంది వీటిని ధరించాలి. 20-25 కిట్లు ఉన్న ఓ ప్యాక్‌కు కొన్ని ఆసుపత్రులు రూ.25-30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. 10-15 రోజులపాటు రోగి ఆసుపత్రిలో ఉంటే 2-3 ప్యాక్‌ల పీపీఈ కిట్లు అవసరం అవుతాయి. ఈ లెక్కన వీటి కోసమే రూ.30-45 వేలు అదనపు బిల్లుల భారం తప్పడం లేదు. కరోనా చికిత్సకు సర్కారు నిర్ణీత ధరలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రోజుకు ఐసోలేషన్‌, సాధారణ వార్డుల్లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్‌తో రూ.9 వేలు వంతున వసూలు చేయాలి. వివిధ కారణాలు చూపి అంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. కరోనాతోపాటు గుండె, కిడ్నీలు ఇతర సమస్యలు ఉంటే బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. అయితే గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఈ చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు.

ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.