ETV Bharat / state

భాగ్యనగరంలో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి

హైద‌రాబాద్​లో క‌రోనా వైరస్​ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. మొన్నటి వరకు రోజుకు వందా, రెండు వందలు ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు జంటనగరాల్లో 5 నుంచి 6 వందలకు చేరింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప‌లు ప్రైవేటు, ప్రభుత్వ కార్యాల‌యాల సిబ్బంది మొత్తం వైర‌స్ బారిన ప‌డ‌డం వల్ల కార్యాల‌యాలు మూతప‌డుతున్నాయి.

Coronal Cases of Expanding in Ghmc region
భాగ్యనగరంలో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి
author img

By

Published : Jun 22, 2020, 8:30 PM IST

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో క‌రోనా కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకూ.. వంద‌ల సంఖ్య‌లో కేసులు నమోదవుతున్నాయి. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం.. ప్రజలు ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా తిర‌గ‌డం వైర‌స్ ఉద్ధృతికి కార‌ణంగా భావిస్తున్నారు.

వైద్యుడు మృతి..

రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి తొలి డాక్టర్ మృతిచెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. వారం రోజుల కిందట జ్వరంతో కిమ్స్ ఆసుపత్రిలో న‌గ‌రానికి చెందిన ఓ వైద్యుడు వచ్చారు. అనుమానంతో కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తెలింది. ఇవాళ చికిత్స పొందుతూ... ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు తెలిపారు.

రాజాసింగ్​కు నెగిటివ్..

కరోనా పరీక్షలో గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్​కు నెగిటివ్ వ‌చ్చింది. తన గన్​మెన్​కు పాజిటివ్‌ నిర్ధరణ కాగా... ఎమ్మెల్యే పరీక్ష చేయించుకున్నారు. చర్లపల్లి డివిజన్​లో పనిచేస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. యూసుఫ్​గూడ సర్కిల్-19 పరిధిలో 22 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఒక్క మధురానగర్ కాలనీలోనే ఐదుగురికి వైరస్ సోకిందని పేర్కొన్నారు. అమీర్​పేట్ కార్పొరేటర్ శేషు కుమారికి కరోనా నిర్ధరణ అయింది. ఆమె కుటుంబ సభ్యుల్లో మరో 6 గురికి మహమ్మారి సోకింది.

కుత్బుల్లాపూర్ పరిధిలో 19 మందికి..

సోమవారం కుత్బుల్లాపూర్ పరిధిలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. కార్యాలయంలోని 13 మంది సిబ్బందికి మహమ్మారి సోకింది. ఇంజినీరింగ్ విభాగంలో డీఏఓకు కరోనా నిర్ధరణ అయింది. మున్సిపల్ ఆఫీస్​ను సిబ్బందిని శానిటైజ్ చేశారు.

మలక్​పేట ఏరియా ఆసుపత్రిలో..

నిజాంపేట్ నగర పాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. నగరపాలక సంస్థలో అత్యవసర సేవ‌లు మినహా... ప్ర‌జ‌లెవరూ... కార్యాలయానికి రావొద్ద‌ని అధికారులు తెలిపారు. మలక్​పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం మూసివేసిన‌ట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి, మూసాపేట సర్కిల్​లో నివాసం ఉండే అన్న‌ద‌మ్ముల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఇవీ చూడండి: నర్సాపూర్ నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.