కరోనా వైరస్ నివారణకై రాజకీయాలకు అతీతంగా... - కోటిలో రసాయనాల పిచికారీ
కరోనా వైరస్ను నిర్మూలించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. తెదేపా యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు గులాబ్ శ్రీనివాస్ బెస్త సూచన మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది కోఠి ఇసామియా బజార్లో రసాయనాలు పిచికారీ చేశారు.
వైరస్ నివారణకై రాజకీయాలకు అతీతంగా...
హైదరాబాద్ నగరంలోని నిరుపేద ప్రజలకు పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అండగా ఉంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తెదేపా యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు గులాబ్ శ్రీనివాస్ బెస్త కోఠి ఇసామియా బజార్ రోజు వారీ కూలీల ఇంటింటికి వెళ్లి నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద ప్రజలకు బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు, భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. బల్దియా సిబ్బందితో కలిసి వీధుల్లో తిరుగుతూ రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలకు కరోనా వైరస్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రామాల మధ్య ముళ్ల కంచెలు...ఘర్షణలు
Last Updated : Apr 6, 2020, 12:48 AM IST